ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్-త్రివిక్రమ్ సినిమాలో విలన్‌గా విక్రమ్?

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 12:44 PM

కోలీవుడ్ దిగ్గజ నటుడు విక్రమ్ మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడని ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్ నటుడు విక్రమ్‌ని ఒప్పించే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఈ మధ్య కాలంలో కోలీవుడ్ నటులు టాలీవుడ్ లో విలన్ గా తమ హవా చూపిస్తున్నారు. ధృవలో అరవింద స్వామి, ఉప్పెనలో విజయ్ సేతుపతి, అల వైకుంఠపురంలో సముద్ర ఖని విలన్లుగా తమ సత్తా చాటారు. ఒకవేళ విక్రమ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటే టాలీవుడ్ కి మరో కొత్త విలన్ దొరికినట్లే. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నటి శోభనతో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన “అతడు” సినిమా మంచి విజయం సాధించగా, “ఖలేజా” సినిమా యావరేజ్ గా నిలిచింది. మరి ఈ కాంబినేషన్ లో రానున్న మూడో సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa