ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రన్‌టైమ్ లాక్ చేసిన అలియా భట్ "గంగూబాయి కతియావాడి"

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 12:54 PM

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ నటించిన" గంగూబాయి కతియావాడి" ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎదురుచూసిన హిందీ సినిమాలలో ఒకటి అని చెప్పొచ్చు. బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా ట్రాక్ లో వస్తున్న  ఈ సినిమాలో సీమా పహ్వా, విజయ్ రాజ్, శంతను మహేశ్వరి, ఇందిరా తివారీ, ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీ , హుమా ఖురేషి అతిధి పాత్రలలో కనిపించనున్నారు. ఫిబ్రవరి 25, 2022న "గంగూబాయి కతియావాడి"  ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఈ సినిమా U/A సర్టిఫికేట్ పొందింది. తాజాగా  ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 36 నిమిషాల పాటు లాక్ చేశారు. అంకిత్ బల్హారా, సంచిత్ బల్హారా మరియు సంజయ్ లీలా బన్సాలీ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa