ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సమయంలో చాలా బాధపడ్డా : రితభరీ చక్రవర్తి

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 01:33 PM

బెంగాలీ నటి బ్యూటీ రితభరీ చక్రవర్తి కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె అందానికి, అభినయానికి యూత్ ఫిదా అయిపోయారు. మొదట నేకేడ్ ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఆ తరువాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక సినిమాలలో తన అందం అభినయం నటనతో ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ అనుష్క శర్మతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత కొద్దికాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా బ్రోకెన్ ఫ్రేమ్ అనే షార్ట్ ఫిలిం తో పాటు మరొక హిందీ సినిమాలో కూడా నటిస్తోంది.


ఇక ఆమె నటిస్తున్న సదరు హిందీ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇక సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ తిరిగి బాలీవుడ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ.. పరి సినిమా తరువాత దాన్ని మించిపోయే పాత్రలే చేయాలని అనుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే తన దగ్గరకు వచ్చిన ఎన్నో అవకాశాలను చేజేతులా పోగొట్టుకున్నట్లు ఆమె తెలిపింది. ఇక ఒకసారి అయితే ప్రాజెక్టు ఓకే అయిన తర్వాత అందులో నుంచి ఆమెను తప్పించారని, ఆ సినిమాలో ఆమె మురికివాడల్లో నివసించే అమ్మాయిగా కనిపించడం కోసం దాదాపుగా 12 కిలోల బరువు తగ్గాను అని చెప్పుకొచ్చింది.


 


కానీ చివరి నిమిషంలో ఆ సినిమా డైరెక్టర్ ఆ సినిమా నుంచి ఆమెను తప్పించి వేరే వారిని తీసుకున్నారు అని ఆమె తెలిపింది. ఆ సమయంలో చాలా బాధపడ్డారని అని చెప్పుకొచ్చింది. ఇక గత ఏడాది రెండు సర్జరీలు అయ్యాయని, అప్పుడు బెడ్ పైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆ సమయంలో ఆమె ఎవరితో కూడా కాంటాక్ట్ లో లేను అని, కానీ కొద్దికాలం తర్వాత మళ్లీ బాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తూ అందరితో మళ్లీ కనెక్ట్ అవుతున్నాను అని చెప్పుకొచ్చింది రితభరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa