మెగా ఫ్యామిలీ హీరోలు ఓకే చోట కలిసి దర్శనమిస్తే ఆ కిక్కే వేరు. వారి నుంచి ఎలాంటి సినిమా వచ్చినా కూడా అభిమానులకు ఒక పండగలా ఉంటుంది. ఇక బయట విషయాలు ఎలా ఉన్నా కూడా మెగా హీరోలు కుటుంబ పరంగా మాత్రం చాలా మంచి రిలేషన్ తో ఉంటారని చెప్పవచ్చు.
అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్యలో విబేధాలు తలెత్తినట్లు అనేక రకాల కామెంట్స్ వినిపించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాటికి ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోవర్స్ ని పెంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ నటన పరంగా కాకుండా తన పర్సనల్ లైఫ్ లో మంచి తనం వల్లనే తన అభిమానుల సంఖ్యను ఎక్కువగా పెంచుకున్నాడు అనే చెప్పాలి. ఏదైనా సమస్య ఉంది అని తెలిస్తే వెంటనే దానిపై స్పందించడనే కాకుండా వీలైతే తన వంతు సహాయం చేసే విధంగా అడుగులు వేస్తూ ఉంటాడు
ఇక మెగాస్టార్ చిరంజీవి తో పవన్ కళ్యాణ్ కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు రాజకీయపరంగా ఈ ఇద్దరు హీరోలు విభిన్నంగా అడుగులు వేసినప్పటికీ కూడా వారిని మధ్యలో అన్నదమ్ముల అనుబంధంలో ఎలాంటి విభేదాలు లేవని చెప్పాలి. కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఇద్దరూ పాల్గొంటూనే ఉంటారు.
ఇక ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా వారి అనుబంధం గురించి ఒక ప్రత్యేకమైన వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ రెండు సినిమాలు కూడా ఒకేచోట షూటింగ్ జరుగగా ఇద్దరూ మెగా బ్రదర్స్ కు ప్రత్యేకంగా సెట్లలో కలుసుకోవడం విశేషం. ఆ వీడియోలో ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా నవ్వుతూ కనిపించారు. వీరితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే కొంతమంది సినీ నటులు కూడా కనిపించారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒకసారి షూటింగ్ నిర్వహించారు. ఇక అదే సమయంలో పక్కనే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఈ సినిమా మలయాళం లుసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. భీమ్లా నాయక్ కూడా మలయాళంలో మంచి విజయం సాధించిన అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.
సినిమా షూటింగ్స్ కూడా ఒకేచోట జరగడంతో ఒకసారి భీమ్లా నాయక్ సెట్స్ లోకి చిరంజీవి రాగా మరోసారి పవన్ కళ్యాణ్ గాడ్ ఫాదర్ సినిమా సెట్స్ లోకి వచ్చాడు. ఇక సినిమాకు సంబంధించిన వీడియోను రామ్ చరణ్ ప్రత్యేకంగా తన ట్విట్టర్ లో షేర్ చేసుకోగా ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. ఇక వీడియో చివరలో భీమ్లా నాయక్ కు ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి ఆల్ ది బెస్ట్ చెబుతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. ఇక గాడ్ ఫాదర్ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa