ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తేజ తనయుడు హీరోగా ఎంట్రీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 08:34 PM

దర్శకుడు తేజ తనయుడు 'అమితవ్' హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇదిలావుంటే తేజ దర్శకుడిగా తన కెరియర్ ఆరంభంలో ప్రేమకథా చిత్రాలను ఎక్కువగా తెరకెక్కిస్తూ వచ్చాడు. ఆ తరువాత తన రూట్ మార్చుతూ విభిన్నమైన కథా చిత్రాలతో కొన్ని ప్రయోగాలు చేశాడు. 'నేనే రాజు నేనే మంత్రి' వంటి కథల క్లైమాక్స్ విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ తరువాత ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపాన్ని దాల్చలేదు. ఆయన తాజా చిత్రంగా 'అహింస' రూపొందుతోంది. రానా సోదరుడు 'అభిరామ్' ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో తేజ బర్త్ డే సందర్భంగా ఆయన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వచ్చింది. 'విక్రమాదిత్య' అనే టైటిల్ తో నల్లమలుపు బుజ్జి నిర్మాతగా ఆయన ఒక సినిమా చేయనున్నట్టు చెప్పారు. 18వ శతాబ్దం నేపథ్యంలో కథ నడుస్తుందని చెప్పారే తప్ప, హీరో ఎవరనేది ప్రకటించలేదు. ఈ సినిమాతో తేజ తనయుడు 'అమితవ్' హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. త్వరలోనే అతని పోస్టర్ వదులుతారని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa