భీమ్లా నాయక్ పై తెలుగు సీనిరంగ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 'భీమ్లా నాయక్' రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో మరో ప్రధానమైన పాత్రను రానా పోషించాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి హీరో వెంకటేశ్ స్పందించారు. ''భీమ్లా నాయక్ రిలీజ్ పై చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా నుంచి వదిలిన ప్రోమోలు .. ట్రైలర్లు ఫెంటాస్టిక్ గా వచ్చాయి. ఈ సినిమాతో పవన్ .. రానా ఇద్దరూ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటారని ఆశిస్తున్నాను" అంటూ ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఇక సినిమా విషయానికి వస్తే, మొదటి నుంచి కూడా పవన్ .. రానా గొడవపడే సన్నివేశాలపైనే టీజర్లు .. ట్రైలర్లు కట్ చేస్తూ వచ్చారు. ఏ విషయంగా వాళ్లిద్దరూ గొడవపడుతున్నారా అని అంతా అనుకున్నారు. ఇది అహంకారానికీ .. ఆత్మాభిమానానికి మధ్య జరిగే యుద్ధం అంటూ పవన్ క్లారిటీ ఇచ్చేడంతో మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa