ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొలిటికల్ థ్రిల్లర్ కథతో..నితిన్ నూతన చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 25, 2022, 05:28 PM

ప్రేమ కథల వైపునుంచి విభిన్న కథల దిశగా అడుగులేస్తున్న నితిన్ తాజాగా పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం వైపు అడుగులేస్తున్నారు. నితిన్ తాజా చిత్రంగా 'మాచర్ల నియోజక వర్గం' సినిమా రూపొందుతోంది. నితిన్ సొంత బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో నడుస్తుందనే విషయాన్ని పోస్టర్ ద్వారానే చెప్పేశారు. అయితే కథా లక్షణాలు 'రంగస్థలం' సినిమాకి దగ్గరగా కనిపిస్తాయని అంటున్నారు. నితిన్ సినిమా గ్రామీణ నేపథ్యంలో .. అక్కడి రాజకీయాలతో ముడిపడి నడుస్తుంది. ఎప్పుడూ ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా గెలిచి అక్రమాలకు పాల్పడుతున్న పెద్ద మనిషి ఆటకట్టించడం కోసం, ఆ పదవికి పోటీ చేస్తూ హీరో రంగంలోకి దిగుతాడట. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రివేంజ్ డ్రామా మొదలవుతుందని అంటున్నారు. నితిన్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 'భీష్మ' తరువాత నితిన్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన నిరీక్షణ ఈ సినిమాతో ఫలిస్తుందేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa