ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో సక్సెక్ సాంగ్ కోసం...తమన్ తపన

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 25, 2022, 11:19 PM

మంచి సక్సెక్ మీదున్న సంగీత దర్శకుడు తమన్ మరో సక్సెక్ కు ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చాలా తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ ను రాబట్టిన పాటల్లో 'సర్కారువారి పాట' సినిమాలోని 'కళావతి' ఒకటిగా కనిపిస్తుంది. మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశలో ఉంది. మైత్రీ .. 14 రీల్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. తమన్ ఈ సినిమాకి బాణీలను సమకూర్చాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన 'కళావతి' పాట ఒక రేంజ్ లో జనంలోకి దూసుకుపోయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ ను .. లైక్స్ ను రాబట్టుకుంది. అనంత్  శ్రీరామ్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన .. కొరియోగ్రఫీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ పాట సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నామనీ. మరో సాంగ్ ను ప్రిపేర్ చేస్తున్నామని తమన్ చెప్పాడు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరో సాంగ్ రానుందన్న మాట. మే 12వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa