ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 25న లైగర్ విడుదల....పాన్ ఇండియా చిత్రంగా

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 25, 2022, 11:30 PM

కరోనా దారికొస్తున్న నేపథ్యంలో సినిమాల విడుదల ఊపందుకొంది. విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'లైగర్' సినిమా రెడీ అవుతోంది. అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. మైక్ టైసన్ అతిథి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు. కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత శివ నిర్వాణ, సుకుమార్ లతో తదుపరి సినిమాలు విజయ్ దేవరకొండ చేయనున్నాడు. ముందుగా శివ నిర్వాణ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఇది ప్రేమకథా చిత్రమని అంటున్నారు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కియారా అద్వానీని తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం శంకర్ - చరణ్ కాంబినేషన్లో చేస్తున్న ఆమె, ఆ తరువాత చేసే సినిమా ఇదే. ఈ సినిమా తరువాత సుకుమార్ తో కలిసి విజయ్ దేవరకొండ సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా చెబుతున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa