ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజంగా ఇది పవర్ తుపానే...భీమ్లా నాయక్ పై చిరు ట్విట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 25, 2022, 11:31 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఘనవిజయం సాధించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'భీమ్లా నాయక్ తిరుగులేని విజయం అందుకున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఇది పవర్ తుపానే' అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన భీమ్లా నాయక్ సెట్స్ పై సోదరుడు పవన్ కల్యాణ్, రానాలతో దిగిన ఫొటోను పంచుకున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పవన్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రివ్యూలన్నీ పాజటివ్ గా వచ్చాయి. విమర్శకులు సైతం పవన్, రానాల నటనకు ఫిదా అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa