విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డీజే టిల్లు. ఈ సినిమా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియా సంగీతం అందించారు. ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ షోకి సిద్ధమవుతోంది. ఈ చిత్రం త్వరలో ఆహా వీడియోలో ప్రసారం కానుంది. మరి ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ షోకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa