త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ మూవీ యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.
ఈ యాక్షన్ సీక్వెన్స్ ఎపిసోడ్‌ని రామ్-లక్ష్మణ్ మాస్టర్ నిర్వహిస్తున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా,భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి కాగానే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa