ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ధమాకా'ను కూడా పట్టాలెక్కించే పనిలో రవితేజ

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 02:29 PM

హీరో రవితేజ మంచి ఊపుమీదున్నట్లు కనిపిస్తోంది. వరుస సినిమాలను పూర్తి చేసి అన్నింటిని వరుసబెట్టి విడుదల చేసే యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. రవితేజ కథానాయకుడిగా ఇటీవలే 'ఖిలాడి' సినిమా థియేటర్లకు వచ్చింది .. రవితేజ మార్క్ సినిమా అనిపించుకుంది. ఆ తరువాత సినిమాగా ఆయన 'రామారావు ఆన్ డ్యూటీ'ని లైన్లో పెట్టేశాడు. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన క్లారిటీ త్వరలో రానుంది. ఇక ఈ నేపథ్యంలో ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'ధమాకా' షూటింగును కూడా చకచకా కానిచ్చేస్తున్నాడు. 'ధమాకా' షూటింగు ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. 'డబుల్ ఇంపాక్ట్' అనేది ట్యాగ్ లైన్. తాజా షెడ్యూల్ ను నిన్ననే మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్లో రవితేజ తదితరులపై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వదిలారు. ఈ సినిమా నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ .. "ఒక భారీ యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ యాక్షన్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. బడ్జెట్ పరంగా ఏ విషయంలోనూ రాజీ పడకుండా ముందుకు వెళుతున్నాం. రవితేజ అభిమానులకు ఈ సినిమా ఒక పండగలా అనిపిస్తుంది" అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో రవితేజ సరసన నాయికగా శ్రీలీల కనిపించనున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa