ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి రోజు నైజామ్ లో ఈ సినిమా 11.80 కోట్ల షేర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 02:30 PM

నైజం ఏరియాలో మెగా బ్రదర్స్ హవా ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా విడుదలైన పవన్ సినిమా భీమ్లా నాయక్ వసూళ్లు ఎంతో తెలుసా...? పవన్ కల్యాణ్ - రానా ప్రధానమైన పాత్రలను పోషించిన 'భీమ్లా నాయక్' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఎంతమాత్రం తగ్గకుండా అదే ఊపుతో దూసుకుపోతోంది. తొలి రోజున నైజామ్ లో ఈ సినిమా 11.80 కోట్ల షేర్ ను సాధించింది. ఇవి ఆల్ టైమ్ రికార్డు వసూళ్లని చెబుతున్నారు. నైజామ్ లో ఈ సినిమా అంచనాలను అందుకుందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ రోజు .. రేపు కూడా ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.  పవన్ క్రేజ్ .. ఆయన పాత్రను మలిచిన తీరు .. రానా కొత్త బాడీ లాంగ్వేజ్ .. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - మాటలు, తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంత గ్యాప్ తరువాత 'వకీల్ సాబ్'తో హిట్ కొట్టిన పవన్, ఆ తరువాత సినిమా అయిన 'భీమ్లా నాయక్'తోను హిట్ కొట్టడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa