ఉక్రెయిన్‌పై రష్యా తెగబడుతున్న దాడులపై అమెరికా నటుడు, దర్శకుడు, రెండుసార్లు ఆస్కార్ విన్నర్ సీన్ పెన్ డాక్యుమెంటరీ తీస్తున్నారు. అందుకోసం ఆయన ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ‘రష్యా చేపడుతున్న సైనిక చర్యను డాక్యుమెంటరీ తీసి, మాపై చేస్తున్న దాడిని ఆయన ప్రపంచానికి తెలియజేయడానికి వచ్చారు’ అని ఉక్రెయిన్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa