తమిళ స్టార్ హీరో అజిత్,హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించిన"వాలిమై"సినిమా వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించగా,హ్యూమా ఖురేషి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.అయితే ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అనుకున్నట్టుగానే చెన్నైలో కలెక్షన్లు సాలిడ్ గా ఉన్నాయి.కానీ తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా పెద్దగా వసూలు రాబట్టలేదు.ఈ సినిమాలో తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు కూడా నటించగా,మేకర్స్ అతని సీన్స్‌ని ట్రిమ్ చేసారు.దర్శకుడుకి అండ్ అజిత్‌కు ఈ విషయంలో యోగి బాబు చాలా నిరాశ పడినట్లు వెల్లడించాడు అని సమాచారం.బోనీకపూర్,జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాణి,సుమిత్ర,అచ్యుంత్ కుమార్,యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa