ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యంగ్ రెబెల్ స్టార్ సినిమాకు రాజమౌళి వాయిస్ ఓవర్?

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 28, 2022, 09:36 AM

టాలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ప్రభాస్"రాధే శ్యామ్"సినిమా ఒక్కటి.రాధాకృష్ణ డైరెక్షన్ లో  రొమాంటిక్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది.ఈ సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ సరసన పూజాహెడ్జ్ నటిస్తుంది.ఈ చిత్రానికి థమన్‌ BGM కంపోజ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పుడు,రాబోయే రోజుల్లో విడుదల కానున్న కొత్త ట్రైలర్‌కి కూడా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ ట్రైలర్‌కి టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్.యువి క్రియేషన్స్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తుంది.తెలుగుతో పాటు తమిళం,కన్నడ,మలయాళం,హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa