ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైజాంలో "భీమ్లా నాయక్" సెకండ్ డే కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 28, 2022, 09:31 AM

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ హ్యాండ్సమ్ హంక్ రానా నటించిన‘భీమ్లా నాయక్’ సినిమా  థియేటర్లలో రిలీజ్ అయ్యింది.ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నిత్యా మీనన్,సంయుక్త మీనన్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ శుక్ర‌వారం విడుదల అయినా ఈ సినిమా మొదటి రోజు రికార్డు క‌లెక్ష‌న్లు వ‌సూలు చేయ‌గా రెండో రోజు కూడా అదే జోరును కొనసాగిస్తోంది.మాస్ యాక్షన్ ట్రాక్ లో వచ్చిన ఈ మూవీ శనివారం నైజాంలో 7.5 కోట్లు వ‌సూలు చేసింది అని సమాచారం.
"భీమ్లా నాయక్"చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మలయాళ హిట్ సినిమా"అయ్యప్పనుమ్ కోషియుమ్"కి తెలుగు రీమేక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa