బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్"ఆదిపురుష్" సినిమా తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.బ్యూటీ క్వీన్ కృతి సనన్ ఈ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తుంది.సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేష్ రోల్ చేయనున్నారు.మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించేందుకు మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.జనవరి 12,2023న గ్రాండ్‌గా విడుదల కానుంది అని మేకర్స్ ప్రకటించారు.T-సిరీస్ అండ్ రెట్రోఫిల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 400 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం.ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ కన్నడ,మలయాళం,తమిళ భాషల్లో విడుదల కానుంది అని మేకర్స్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa