మలయాళ ముద్దుగుమ్మ అమలా పాల్ ఓ ఇటాలియన్ కేఫ్ ముందు గ్లామర్ సర్కస్ చేసింది. మెట్లపై నిలొని పోజులు కొట్టింది. వాటిన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. 'Always Stand tall' అనే కామెంట్ పెట్టింది. బ్యాక్ గ్రౌండ్ కు సెట్టయ్యే డ్రెస్ లో అమలా రెచ్చిపోయింది. అమలా పాల్ కు తెలుగులో మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది. 'బెజవాడ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది అమల. ఆ తర్వాత లవ్ ఫెల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు సినిమాల్లో నటించింది. ఆమె నటించిన వెబ్ సిరీస్ 'పిట్టకథలు' గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం అమల ఐదు సినిమాల్లో నటిస్తోంది. ఇందులో మూడు తమిళ సినిమాలు అధో అంధ పరవై పోలా, రెండు మలయాళ సినిమాలు ఆడుజీవితం, టిచర్ ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa