కన్నడ బ్యూటీ అండ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న,రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నట్లుగా ఈ మధ్యకాలంలో పుకారాలు వస్తున్నాయి.ఇటీవల జరిగిన ఒక మీడియా పోర్టల్ కూడా రష్మిక అండ్ విజయ్ ఈ సంవత్సరం వివాహం చేసుకుంటున్నట్లుగా వెల్లడించారు.అయితే విజయ్ అండ్ రష్మిక ఇద్దరూ ఈ పుకార్లను ఖండిస్తున్నారు.తాజాగా మీడియాతో మాట్లాడిన రష్మిక ఇదే విషయంపై స్పందించింది.“ఎవరితోనైనా నా పెళ్లికి సంబంధించిన పుకార్లు కేవలం టైంపాస్ మాత్రమే.త్వరలో పెళ్లి చేసుకునే మూడ్‌లో లేను,దానికి చాలా సమయం ఉంది.” అని నేషనల్ క్రష్ తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa