ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆదిపురుష్'​ రిలీజ్​ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 11:31 AM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ నటిస్తున్న 'ఆదిపురుష్'​ సినిమా కొత్త రిలీజ్​ డేట్​ను మూవీ టీం ప్రకటించింది. 2023 జనవరి 12న 3డీలో ప్రపంచవ్యాప్తంగా థియేటరల్లో రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించారు. బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్​ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్​, రెట్రోఫైల్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతిసనన్‌ సీత పాత్రలో, సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా, సన్నీ సింగ్​ లక్ష్మణుడి పాత్రలో, మరాఠి నటుడు దేవ్​దత్త నగే హనుమంతుడిగా కనిపించనున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa