ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి "భోలా శంకర్‌" ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 11:33 AM

మెహర్ రమేష్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి "భోళా శంకర్"సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.ప్రస్తుతం "భోళా శంకర్" షూటింగ్‌లో చిరు బిజీగా ఉన్నారు.ఈ హైబడ్జెట్ మూవీలో చిరంజీవి శంకర్ అనే క్యారెక్టర్‌ని పోషిస్తున్నారు అని లేటెస్ట్ టాక్.ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కథానాయికగా నటిస్తోంది.రావు రమేష్,మురళీ శర్మ,తులసి,వెన్నెల కిషోర్,కీర్తి సురేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ,మూవీ మేకర్స్ ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన చిరంజీవి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిరంజీవి స్టైలిష్ గా కనిపిస్తున్నారు.ఈ పోస్టర్ చిరు ఫాన్స్ అందరిని ఆకట్టుకుంటుంది.అలాగే మేకర్స్ పవర్ ఫుల్ బ్యాక్‌గ్రూతో కూడిన మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా   విడుదల తేదీని మేకర్స్ రానున్న రోజుల్లో ప్రటకించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa