యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం"రాజా వారు రాణి గారు","ఎస్ఆర్ కళ్యాణమండపం"సినిమాలతో హిట్ సాధించాడు.అతని రాబోయే చిత్రం‘సెబాస్టియన్ పి.సి. 524’పల్లెటూరి కథతో వస్తున్న ఈ సినిమాలో రాత్రి అంధత్వం ఉన్న క్యారెక్టర్ లో కిరణ్ కనిపించనున్నాడు.బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నమ్రత దారేకర్,కోమలి ప్రసాద్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేయగా,ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించింది.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,సెబాస్టియన్ PC 524 ట్రైలర్ 24 గంటల్లో 4 మిలియన్ల వీక్షణలను సంపాదించింది అని మేకర్స్ వెల్లడించారు.మూవీ మేకర్స్ ట్విట్టర్ లో కొత్త పోస్టర్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.ఈ సినిమాలో కోమలి ప్రసాద్,శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య,రోహిణి రఘువరన్,ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జ్యోతి సినిమాస్‌పై ప్రమోద్ మరియు రాజు నిర్మిస్తున్నారు.ఈ కామెడీ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తునా ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa