మొదటి సినిమా "ఉప్పెన"తో హిట్ సాధించిన పంజా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం "రంగ రంగ వైభవంగా" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేతికా శర్మ వైష్ణవ్ సరసన నటిస్తుంది.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం.యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.మే 27,2022న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ చిత్రాన్ని SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ బ్యాంక్రోల్ చేశారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa