కోలీవుడ్ స్టార్ హీరో సూర్య "ఎతర్క్కుం తునింధవన్" సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయటానికి రెడీగా ఉన్నాడు.ఈ యాక్షన్ డ్రామా సినిమాలో సూర్య సరసన ప్రియాంక మోహన్ నటిస్తుంది.పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమా మార్చి 10,2022న థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ట్రైలర్‌ని ఈరోజు ఉదయం 11.30గంటలకు విజయ్ దేవరకొండ విడుదల చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 3న హైదరాబాద్‌లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు అని సమాచారం.సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగు,హిందీ,కన్నడ,మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa