ప్రముఖ బిజినెస్ మ్యాన్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు,కిరీటి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు-కన్నడలో రిలీజ్ కానుంది.టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ఈ సినిమాని నిర్మిస్తుంది.ఈ హై బడ్జెట్ మూవీకి ఇంకా మేకర్స్ టైటిల్ ని లాక్ చేయలేదు.లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ అండ్ భారతదేశపు టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ ఈ సినిమాలోని యాక్షన్ స్కీన్స్ ని కొరియోగ్రాఫ్ చేయనున్నారు.మార్చి 4న ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ జరగనుంది అని ఫిలింఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa