భీమ్లా నాయక్ చిత్రంలో హీరోయిన్ గా నట్టించిన నిత్యామీనన్ ఆ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దూరంగా ఉన్నారు. ఇది పైకి పెద్ద చర్చగా సాగకపోయినా అంతర్గతంగా మాత్రం తీవ్ర చర్చగానే సాగుతోంది. ఇదిలావుంటే మొదటి నుంచి కూడా నిత్యామీనన్ తనకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది. నటనకి అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మధ్య కాలంలో ఆమె మాత్రమే చేయదగిన పాత్రలు రాలేదనే అనుకోవాలి. కొంత గ్యాప్ తరువాత ఆమె చేసిన సినిమానే 'భీమ్లా నాయక్'. ఈ సినిమాలో పవన్ భార్యగా నిత్యామీనన్ కనిపించింది. తన సహజమైన నటనతో ఆ పాత్రలో ఆమె మెప్పించింది. ఈ సినిమా నుంచి 'అంత ఇష్టం ఏందయ్యా' అనే పాటను రిలీజ్ చేయగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్ర పాడిన ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే సినిమాలో ఈ పాట లేదు .. కథకి అడ్డు తగులుతుందని లేపేశారట. సినిమాలో ఇది నిత్యామీనన్ వైపు నుంచి వచ్చే పాట. తనకి నచ్చిన పాట .. తనకి మంచి క్రేజ్ తెచ్చిపెడుతుందనుకున్న పాటను లేపేయడం వలన నిత్యామీనన్ చాలా ఫీలైందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఆమె అందుకనే రాలేదని చెప్పుకుంటున్నారు. ఇక ఆ స్టేజ్ పై ఆమె పేరును ప్రత్యేకించి ఎవరూ చెప్పకపోవడం కూడా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa