లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్,ఫహద్ ఫాసిల్,విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో "విక్రమ్" సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే.తాజాగా,ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది అని డైరెక్టర్ లోకేష్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాని 110రోజుల పాటు షూట్ చేసారు.కాళిదాస్ జయరామ్,నరైన్,అర్జున్ దాస్ అండ్ శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు.రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా "విక్రమ్" సినిమా సౌత్ ఇండియన్ సినిమాల్లో చాలా మంది ఎదురుచూస్తున్న మల్టీస్టారర్లలో ఇది ఒకటి.త్వరలో విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa