ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆది పినిశెట్టి రేంజ్ ను చూపిస్తూ పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 04:33 PM

కొన్ని చిత్రాలలో ఎవరి పాత్ర ఏమిటో వారి వారి సినిమా పోస్టర్ల లోనే అన్ని తెలిసిపోతాయి. తాజాగా రామ్ హీరోగా దర్శకుడు లింగుస్వామి 'ది వారియర్' సినిమా రూపొందిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో రామ్ సరసన నాయికగా కృతి శెట్టి అలరించనుంది. ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు.  'మహాశివరాత్రి' సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఆది పినిశెట్టి ఫస్టులుక్ ను వదిలారు. ఆది పినిశెట్టి పాత్రను ఎంత డిఫరెంట్ గా డిజైన్ చేశారు .. ఆయన పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండనుందనేది ఈ పోస్టర్ చూస్తేనే అర్థమైపోతోంది. ఆయన విలనిజం ఏ రేంజ్ లో ఉంటుందన్నది ఆయన లుక్ చెప్పేస్తోంది. రామ్ మొదటిసారిగా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. 'రెడ్' సినిమా రిజల్ట్ తో డీలాపడిన రామ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన బోయపాటితో చేయనున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa