ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూఎస్ ఆర్మీలో చేరిన హీరోయిన్ అఖిలా నారాయణన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 10:15 AM

తమిళ యంగ్ బ్యూటీ అఖిలా నారాయణన్ అరుదైన ఘనత దక్కించుకుంది. భారతీయ సంతతికి చెందిన అఖిల అమెరికా సాయుధ దళాల్లో చేరిన మొదటి నటిగా చరిత్ర సృష్టించింది. గతేడాది అరుల్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ 'కాదంపరి'తో తెరంగేట్రం చేసిన ఆమె... యూఎస్ఆర్మీలో చేరడంపై సర్వత్రహర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయుధ దళాల్లోకి జాయిన్ అయ్యేందుకు కొన్ని నెలల పాటు యూఎస్ ఆర్మీ పోరాట శిక్షణ పొందాల్సి వచ్చిందన్న ఆమె.. విజయ వంతంగా పూర్తి చేసి సలహా దారుగా సేవలందించ నున్నట్లు తెలిపింది. ఇక అమెరికా సైన్యానికి న్యాయ సలహాలు అందిస్తూనే 'నైటింగేల్ ఆఫ్ మ్యూజిక్' పేరుతో నిర్వహిస్తున్న సంగీత పాఠశాలను అలాగే కంటిన్యూ చేస్తానని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa