అజిత్ నటించిన 'వాలిమై' సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేదు కానీ చెన్నైలో ఈ మూవీ సాలిడ్ వసూలు రాబటింది.హెచ్ వినోద్ డైరెక్షన్ లో అజిత్ 'AK61' సినిమాలో నటిస్తున్నాడు అని అందరికి తెలిసిన విషయమే.ఈ సినిమాని కూడా బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.యాక్షన్ డ్రామా ట్రాక్ లో రాబోతున్న ఈ సినిమా కోసం అజిత్ లుక్ మార్చాడు.తెల్ల జుట్టు అండ్ పొడవాటి గడ్డంతో ఈ సినిమాలో కనిపించనున్నాడు.ఈ కొత్త లుక్‌తో ఉన్న అజిత్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.అజిత్ సూట్‌లో చాలా కూల్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా కోసం అజిత్ 10 కిలోలు తగ్గాడు అని లేటెస్ట్ టాక్.ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa