యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే నటిస్తున్న 'రాధేశ్యామ్' మార్చి 11న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో మూవీ టీమ్ అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,'రాధేశ్యామ్' సినిమా తెలుగు వెర్షన్ UKలో £71,200 అడ్వాన్స్-సేల్స్ చేసింది, అయితే USAలోని 400 ప్లస్ లొకేషన్స్ నుండి $175k దాటింది అని సమాచారం.యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణం రాజు,జగపతి బాబు,భాగ్యశ్రీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ పెరియాడికల్ రొమాంటిక్ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ పాటలు కంపోజ్ చేయగా,థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa