రాధే శ్యామ్'లో ప్రభాస్కు తల్లిగా కనిపించనున్న ఆమె.. ఇప్పుడొచే హిందీ సినిమాలన్నీ పాత కథలేనని పెదవి విరిచింది. 'ప్రస్తుతం వస్తున్న బాలీవుడ్ చిత్రాలన్నీ కాపీ స్క్రిప్ట్, తెలుగు, మలయాళంలో కొత్తగా ప్రయ త్నిస్తున్నారు. ఈ జనరేషన్ కూడా పాన్ ఇండియా రేంజ్ స్టోరీస్ నే ఇష్టపడు తున్నారు. ప్రేక్షకులు కూడా మంచి సినిమాలు వస్తే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. ఈ విషయాన్ని సీనియర్ డైరెక్టర్స్, స్టోరీ రైటర్స్ గుర్తించట్లేదు. నిజానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వల్ల మన సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది అని చెప్పుకొచ్చింది. అంతేకాదు యంగ్ డైరెక్టర్ల క్రియేటివిటీ బాగుంటుందన్న ఆమె.. అలాంటి వారితో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa