గ్లామర్ బ్యూటీ శ్రద్ధా దాస్.. సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచ యమైంది. ఆ తర్వాత ఆర్య-2,డార్లింగ్, నాగవల్లి, మరోచరిత్ర, మొగుడు, రేయ్, డిక్టేటర్, గుంటూర్ టాకీస్, ఏక్ మినీ కథ చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు హిందీ సినిమా ల్లోనూ భాగమవుతున్న ఈ బ్యూటీ తాజాగా 'అర్థం' మూవీలో నటించింది. నిన్న శ్రద్ధా దాస్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. మణికాంత్ తాళ్లగూటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తమిళ నటుడు మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో మాయ అనే సైకియాట్రిస్ట్ గా శ్రద్ధ నటిస్తోంది. మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రాధిక శ్రీనివాస్ నిర్మించిన సినిమాను తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కి స్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ మ్యూజికల్ టీజర్ సూపర్ రెస్పాన్స్ దక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa