టాలీవుడ్ హీరో విష్ణు మంచు ప్రస్తుతం ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.కొద్ది రోజుల క్రితం,విష్ణు ఈ సినిమాకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలో గాలినాగేశ్వరావ్ పాత్రను పోషిస్తున్నట్లు వెల్లడించారు.ఈ సినిమా నుండి ఒక ఫోటో ని కూడా ఈ హీరో పోస్ట్ చేసారు.ఈ చిత్రానికి కోన వెంకట్ కథ అండ్ స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసారు.ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.ఈ మూవీకి మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు.ఈ ప్రాజెక్ట్‌కి అనూప్ రూబెన్స్ సంగీత అందిస్తున్నారు.ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రానున్న రోజులలో మేకర్స్ వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa