ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 05, 2022, 11:57 AM
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే లాక్ అప్ అనే రియాలిటీ షోలో నటిస్తోంది. దీనికి కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, ఎంఎక్స్ ప్లేయర్‌లో సదరు రియాలిటీ షో ప్రసారమవుతోంది. ఈ కార్యక్రమంలో పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంటర్నెట్‌లో తన ఫొటోలు, వీడియోలు చూసి ట్రోలర్లకు నిద్ర పట్టదని పేర్కొంది. తాను బట్టలు విప్పి ఫొటోలు తీసుకున్నంత మాత్రాన తనకు సిగ్గు లేదని అనుకోవద్దని చెప్పింది. తనను అలా చూసిన వారికే సిగ్గులేదని పేర్కొంది. పూనమ్ పాండే తన భర్త సామ్ బాంబేపై గృహ హింస కేసు పెట్టిన విషయాలను కూడా ఈ షోలో చెప్పింది. సామ్ బాంబే ఉదయం ఉంచి రాత్రి వరకు మద్యం తాగుతూ, తనను తీవ్రంగా హింసించేవాడని వివరించింది. ఈ వ్యాఖ్యలపై సామ్‌ బాంబే తీవ్రంగా మండిపడ్డాడు. తాము హనీమూన్‌కు వెళ్లినప్పుడు శృంగారంలో పాల్గొంటే, అత్యాచారం చేశానని ఆమె కేసు పెట్టినట్లు వాపోయాడు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa