ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భీమ్లా నాయక్‌'కి హిందీలో వాయిస్ ఓవర్ ఇస్తుంది ఎవరో తెలుసా ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 05, 2022, 11:59 AM

తెలుగురాష్ట్రాలలో సంచలన రికార్డులు క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమా 'భీమ్లా నాయక్' ఇప్పుడు నార్త్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది.సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ హ్యాండ్సమ్ హంక్ రానా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.యాక్షన్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేస్తున్న B4U మోషన్ పిక్చర్స్,సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,పవన్ కళ్యాణ్'భీమ్లా నాయక్'కి హిందీలో గౌరవ్ చోప్రా వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సమాచారం.'భీమ్లా నాయక్' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మలయాళ హిట్ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియుమ్' కి తెలుగు రీమేక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa