సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. 2018లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు పొందింది. టాలీవుడ్ క్లాసికల్స్ లో ఒకటిగా నిలిచింది. రామ్ చరణ్ ను నటుడిగా ఒక మెట్టు పైకి ఎక్కించిన చిత్రం రంగస్థలం. అలంటి క్లాసికల్ ను టాలీవుడ్ కి అందించిన సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ రిపీట్ ఐతే ఎలా ఉంటుంది? జిగేలుమనదూ!! ఈ వార్తతో త్వరలోనే అభిమానులకు శుభవార్తను చెప్పబోతున్నారని ఇండస్ట్రీలో టాక్. ఈ మధ్య రాంచరణ్ ను కలిసిన సుకుమార్ ఒక స్టోరీ లైన్ ను వినిపించగా, ఆ ఐడియా చరణ్ కు బాగా నచ్చడంతో పూర్తి కథను తయారు చేసే పనిలో ఉన్నారట సుకుమార్. కానీ దీనికన్నా ముందు సుకుమార్ "పుష్ప2" పూర్తి చేయాల్సి ఉంది. రామ్ చరణ్ కూడా RC15 తో బిజీగా ఉన్నాడు. తర్వాత వరుసగా గౌతమ్ తిన్ననూరి, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చరణ్ సినిమాలు చేయాల్సి ఉంది. మరి సుక్కు-చరణ్ కాంబినేషన్ ఎప్పుడు పట్టాలెక్కనుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటించేంత వరకు ఎదురు చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa