ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హ్యాపీ బర్త్ డే మధుబాల - టీం యశోద

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 05, 2022, 12:35 PM

సమంత లీడ్ రోల్ లో హరి శంకర్, హరీష్ నారాయణ్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం యశోద. శ్రీదేవి మూవీస్ బ్యానర్లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ సంవత్సరంలోనే విడుదల అయ్యే అవకాశం ఉందని చిత్రబృందం తెలిపింది. మార్చి 5న వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, హ్యాపీ బర్త్ డే టు అవర్ మధుబాల అని స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ ద్వారా చిత్రంలో  వరలక్ష్మి పాత్ర పేరు మధుబాల అని తెలుస్తుంది. ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి. మార్చి 5,1985 లో పుట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ పోడా పోడి (2012) చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ బి.ఏ బి.ఎల్ తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. రవితేజ నటించిన "క్రాక్" సినిమాలో జయమ్మగా ఆమె నటన తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. వరలక్ష్మి రూపంలో టాలీవుడ్ కు మంచి లేడీ విలన్ దొరికిందని తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa