ఇటీవల కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, అందాలభామ సోనాక్షి సిన్హా ఆ ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. సోనాక్షి చేతివేలికి సల్మాన్ ఉంగరం తొడుగుతుండడం ఆ ఫొటోలో చూడొచ్చు. దాంతో, వారిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ, అందుకు ఆ ఫొటోనే నిదర్శనమంటూ భారీస్థాయిలో ప్రచారం జరిగింది. అయితే, ఆ ఫొటో ఫేక్ అని ఆ తర్వాత తేలిపోయింది. దీనిపై సోనాక్షి సిన్హా స్పందించింది. "మీరేమైనా వెర్రివాళ్లా? మార్ఫింగ్ చేసిన ఫొటోకి, నిజమైన ఫొటోకి తేడా ఏంటో చెప్పలేరా? ఆ మాత్రం తెలుసుకోలేకుండా ఉన్నారా?" అంటూ కాస్తంత అసహనం ప్రదర్శించింది. బాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ వేత్త శత్రుఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి దబాంగ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో హీరో సల్మాన్ ఖానే. ఇక, సోనాక్షి ప్రస్తుతం డబుల్ ఎక్స్ఎల్ అనే చిత్రంలో నటిస్తోంది. సల్మాన్ ఖాన్ టైగర్-3లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa