ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నందిని రెడ్డి మాటలు తనను మామూలు మనిషిగా మార్చాయి

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 12:01 PM

కష్టాల్లో ఉన్నపుడు ఆదుకొన్నవాడే అసలైన స్నేహితులు. దక్షిణాది చిత్రసీమలో ప్రతిభావంతులైన నటీమణుల్లో సమంత ఒకరు. ఏ పాత్ర పోషించినా అందులో లీనమైపోయి నటించే సమంతకు అనేక భాషల్లో పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. ఇటీవలే తన వ్యక్తిగత జీవితంలో అతిపెద్ద కుదుపును ఎదుర్కొంది. నాగచైతన్యతో వైవాహిక జీవితానికి సమంత ముగింపు పలికింది.  ఇక అసలు విషయానికొస్తే... సమంతకు టాలీవుడ్ లో ఫ్రెండ్స్ కు కొదవలేదు. దర్శకురాలు నందిని రెడ్డి కూడా సమంతకు బెస్ట్ ఫ్రెండ్. ఇవాళ నందిని రెడ్డి పుట్టినరోజు కావడంతో సమంత ఎమోషనల్ గా స్పందించింది. 2012లో జరిగిన ఓ సంఘటనతో తాను ఎంతో కుంగిపోయానని సమంత వెల్లడించింది. కెరీర్ ఇక ముందుకు సాగదన్న బలమైన నిర్ణయానికి వచ్చానని, అసలు ఆత్మవిశ్వాసం అన్నదే లేకుండా పోయిందని తెలిపింది. అలాంటి సమయంలో నందిని రెడ్డి వచ్చిందని, తనలో ఎంతో ధైర్యం నింపిందని సమంత వెల్లడించింది. నందిని రెడ్డి మాటలు తనను మామూలు మనిషిగా మార్చాయని, ఆనాడు నందినిరెడ్డి కలిగించిన స్ఫూర్తితో ఆ మరుసటి రోజే సినిమా రంగానికి పునరంకితం అయ్యానని వివరించింది. "ఎంతో బిజీ షెడ్యూల్ లోనూ నాకోసం సమయం కేటాయించి మాట్లాడావు. నాలో నాపై నమ్మకం కలిగించేందుకు టెస్ట్ షూట్ ఏర్పాటు చేశావు. నందినిరెడ్డి నువ్వు అందించిన స్ఫూర్తిని ఎప్పటికీ మరువలేను. ఇది మచ్చుకు ఒక్క సంఘటనే. చాలా సమయాల్లో నాకు మద్దతుగా నిలిచావు. నీకు జన్మదిన శుభాకాంక్షలు" అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతేకాదు, నందినిరెడ్డితో కలిసి ఉన్నప్పటి ఫొటోలను కూడా సమంత పంచుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa