SSరాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నటించిన 'RRR' సినిమా మార్చి 25,2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ హై బడ్జెట్ యాక్షన్ డ్రామా నిర్మాతలు మళ్లీ ప్రమోషన్‌లను ప్రారంభించారు.USAలో ప్రీమియర్ షోల ప్రీ-సేల్స్ ప్రారంభం కాగా 'RRR' ఇప్పటికే $500K మార్కును క్రాస్ చేసింది అని లేటెస్ట్ టాక్.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,ఈ వారాంతంలో RRR $1మిలియన్ మార్కును చేరుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.'RRR' USA బాక్సాఫీస్ వద్ద రికార్డ్-బ్రేకింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అందరూ భావిస్తున్నారు.డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ భారీ బడ్జెట్ మూవీలో అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.హిందీ,తమిళం,మలయాళం అండ్ కన్నడ భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa