యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ ఆదిపినిశెట్టి నటిస్తున్న 'క్లాప్' సినిమా OTT ప్లాట్‌ఫారమ్ సోనీ LIVలో ప్రదర్శించనున్నట్లు కొన్ని వారాల క్రితం మేకర్స్ ప్రకటించారు.ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను OTT ప్లాట్‌ఫారమ్ తాజాగా విడుదల చేసింది.ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో ఈ ట్రైలర్ ఉంది.పృథివీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆదిని అంగవైకల్యం కలిగిన అథ్లెట్‌గా చూపించారు.ఈ చిత్రం మార్చి 11,2022న ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని సోనీ LIV ప్రకటించింది.ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్,కృష్ణ కురుప్,ప్రకాష్ రాజ్,నాసర్,బ్రహ్మాజీ తదితరులు నటించారు.ఈ స్పోర్ట్స్ డ్రామాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa