ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాధేశ్యామ్‌'కి సంబంధించిన మేజర్ అప్‌డేట్‌ను వెల్లడించిన దర్శకుడు రాధాకృష్ణ

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 07, 2022, 11:04 AM

పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుంది.పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా గురించి ప్రశ్నలను అడగమని దర్శకుడు రాధాకృష్ణ ట్విట్టర్‌లో అభిమానులను కోరారు.కొన్ని ప్రశ్నలకు 'రాధేశ్యామ్' డైరెక్టర్ సమాధానమిచ్చారు.ఒక ప్రశ్నకు స్పందిస్తూ,ఈ చిత్రంలో రెండు జన్మలు లేవు అని కంఫర్మ్ చేసారు.ఈ చిత్రంలో సత్యరాజ్,భాగ్యశ్రీ, ప్రియదర్శి,మురళీ శర్మ,జగపతి బాబు,సచిన్ ఖేడేకర్,కృష్ణం రాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.యువి క్రియేషన్స్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తుంది.ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa