ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిస్క్ చేస్తున్న రాజ్ తరుణ్...

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 07, 2022, 11:04 AM

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. అయితే తొలి మూడు సినిమాలు సాధించిన సక్సెస్ ఆ తర్వాత సినిమాలు సాధించలేకపోయాయి అని చెప్పవచ్చు.ఏ జోనర్ లో సినిమా చేసినా కూడా ఈ హీరోకు ఏ మాత్రం కలిసి రావడం లేదని చెప్పాలి. ఆఖరికి హారర్ థ్రిల్లర్ జోనర్ లో కూడా సినిమా చూసే ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయగా రాజ్ తరుణ్ కు అది కూడా ఏమాత్రం కలిసి రాలేదు. ఆ సినిమా ఆయన కు పెద్ద చెడ్డ పేరును తీసుకు వచ్చింది అని చెప్పవచ్చు.


ఆ విధంగా ఇప్పుడు భారీ అంచనాల మధ్య రాజ్ తరుణ్ సినిమాలు చేస్తున్నాడు. స్తాండప్ రాహుల్ అనే ఓ వినూత్నమైన కథ తో ప్రేక్షకులను అలరించి హిట్ సాధించడానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ ఈ సినిమాతో విజయాన్ని అందుకోగా ఎలాగైనా మళ్లీ సక్సెస్ బాటలో పయనించాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ హీరో ఆ సినిమాతో ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి. రాజ్ తరుణ్ అభిమానులు కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు.


 


ఇకపోతే ఈ సినిమాను మార్చి 18వ తేదీన విడుదల చేయబోతున్నట్లు గా చిత్రబృందం ప్రకటించింది మార్చి 11వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది అలాగే మార్చి 25వ తేదీన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలో ఈ రెండు భారీ చిత్రాల నడుమ ఈ చిన్న చిత్రాన్ని విడుదల చేయడం ఎంతవరకు కరెక్ట్ ఈ విషయం తెలియాల్సి ఉంది. ఏదేమైనా రాజ్ తరుణ్ తన కెరీర్ ప్రమాదంలో ఉండగా ఇలాంటి ప్రయోగాలు చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఈ నేపథ్యంలో ఈ హీరో ఏ విధంగా తన కెరియర్ ను నెట్టుకు వస్తాడో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa