ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘హరిహర వీరమల్లు’ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 07, 2022, 03:06 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ను వచ్చే వారం నుంచి స్టార్ట్ కానుంది. ముందుగా యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు. ఇక ఈ సీక్వెన్స్ కోసం ఇప్పటికే ప్రత్యేక సెట్స్ కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు ఈ షెడ్యూల్ తో సినిమాలో కీలక భాగం షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందట. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa