ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైన్ ఇష్క్ మెయిన్ హున్ టీజర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 07, 2022, 03:10 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం మార్చ్ 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కి సిద్దం అవుతోంది. ఈ చిత్రం ను యూ వి క్రియేషన్స్ పతాకంపై భారీగా నిర్మించడం జరిగింది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.తాజాగా ఈ చిత్రం నుండి మైన్ ఇష్క్ మెయిన్ హున్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఎంతో అద్భుతమైన విజువల్స్ తో అమితాబ్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ఉండటం విశేషం. ఇందుకు సంబంధించిన పూర్తి పాట రేపు విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa