ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ ఆర్ ఆర్ ను వదిలేసి ప్రభాస్ తో ముచ్చటించనున్న జక్కన్న!!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 12:40 PM

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గానే కాక వరల్డ్ వైడ్ గా కూడా గుర్తింపును,అభిమానులను సంపాదించుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. సాహో తర్వాత మళ్ళీ మూడేళ్లకు ప్రభాస్ ను థియేటర్లలో చూసే అవకాశం రాధేశ్యామ్ ద్వారా వచ్చింది.  రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ప్రభాస్, పూజ హెగ్డే జంటగా, పిరియాడికల్ రొమాంటిక్ ఎంటెర్టైనెర్గా రూపొందిన చిత్రం రాధేశ్యామ్. దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్టుతో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలవనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా ప్రొమోషన్సు చేస్తున్నారు చిత్రబృందం. ప్రభాస్, పూజ హెగ్డే మీడియాకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ తో ఈ సినిమా పట్ల అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉండగా, ప్రొమోషన్సులో భాగంగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళినే రంగం లోకి దింపనుందట చిత్రబృందం. రాధేశ్యామ్ గురించిన విషయాలను ప్రభాస్, రాజమౌళి కలిసి ముచ్చటించుకోనున్నారని వినికిడి. అయితే రాజమౌళి దర్శకత్వం వహించిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ కూడా ఈ నెల 25న రిలీజ్ అవ్వనుందన్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.    ఆర్ఆర్ఆర్ విడుదలను లెక్క చేయకుండా ప్రభాస్ రాధేశ్యామ్ కోసం ప్రచారం చేయనున్నాడట జక్కన్న. దీంతో ఈ సినిమా వేరే లెవెల్ కి వెళ్లడం ఖాయమని చెబుతున్నారు. ప్రభాస్- రాజమౌళి మధ్య విడదీయరాని అనుబంధమే ఇందుకు కారణమని తెలియకనే తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa