తాజాగా సాలిడ్ ఎంటర్ టైనర్స్ పతాకంపై నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ” . అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే, మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్‌ను అందించారు. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ను వెల్లడిస్తూ చిత్ర యూనిట్ మొత్తం స్పెయిన్‌లో దిగేందుకు సిద్ధమైంది. కొన్ని పాటల చిత్రీకరణ కోసం ఆయన అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అలాగే ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa